కన్నడ వచనము
ಮಾಡಿದೆನೆಂಬುದು ಮನದಲ್ಲಿ ಹೊಳೆದರೆ
ಏಡಿಸಿ ಕಾಡಿತ್ತು ಶಿವನ ಡಂಗುರ.
ಮಾಡಿದೆನೆನ್ನದಿರಾ ಲಿಂಗಕ್ಕೆ, ಮಾಡಿದೆನೆನ್ನದಿರಾ ಜಂಗಮಕ್ಕೆ!
ಮಾಡಿದೆನೆಂಬುದು ಮನದಲಿಲ್ಲದಿದ್ದರೆ
ಬೇಡಿದ್ದನೀವ ಕೂಡಲಸಂಗಮದೇವ!
తెలుగు లిపిలో:
మాడిదెనెంబుదు మనదల్లి హొళెదరె
ఏడిసి కాడిత్తు శివన డంగుర
మాడిదెనెన్నదిరా లింగక్కె, మాడిదెనెన్నదిరా జంగమక్కె!
మాడిదెనెంబుదు మనదలిల్లదిద్దరె
బేడీద్దనీవ కూడలసంగమదేవ!
తెలుగు వచనము:
చేసితినని మనసునదలిస్తే
ఏసి వేటాడు శివుని డమరుకం
చేసితిననకు లింగమునకు, చేసితిననకు జంగమమునకు
చేసితినని మనసున లేకున్న
వేడినదిచ్చును కూడలసంగమ దేవుడు!
వచనకర్త ఆంతర్యం:
చేసితినని తలంచిన వెంటనే అహంకారము వెంటాడుతుంది. తదహంకారము శివుని డమరుకం వలే నిన్ను వేటాడి నాశన హేతువౌను. అందుకే చేసేది నేనని అహంకారించకు. లింగమును పూజించినా, జంగమమున కర్పించినా నే చేసితినని తలంచకు. శివాజ్ఞగా గ్రహించి, చేసినది నేనని తలంచకున్న, ఆ శివుడే ఈప్సితములు తీర్చును.
విశ్లేషణ:
బసవన్న ఈ వచనంలో రెండు విషయాలు చర్చించారు:
1. నిష్కామకర్మ
2. అహంకారముపై హెచ్చరిక
ఏ సుకర్మ చేసినా దానిని నేను చేసాననే మనోవికల్పము వెంటనే కల్గుతుంది. ఉదాహరణకు నేను ఆ బడి కట్టించాను, ఆ గుడిలో ఇంత దానము చేసాను అని ప్రకటించుకోవడం మనకు నిత్యం కనబడుతూ ఉంటుంది. అంతెందుకు మీరు ఒక గుడికి వెళ్లి చూసినా, సత్రానికి వెళ్లి చూసినా, ప్రతీ వస్తువుపై దాత పేరు వ్రాసుకుంటున్నారు. గోడ పైన, తలుపుల పైన, చివరకు చిన్న వ్యజనపు రెక్కపై (fan's blade) కూడా దాత పేరు కనబడుతుంది. అంటే దాత ఆ వస్తువు దానంగా ఇచ్చిన తరువాత కూడా దానిపై తన అధికారాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటిది దానమవుతుందా?
వీరశైవులకు ఇచ్చిన దానిని తలంచడం నిషేధమని బసవన్న గట్టిగ చెబుతున్నారు. అలా చేయడం దోషమని, అలాంటి వారిని శివుని డమరుకం వెంటాడుతుందని, పీడిస్తుందని చెప్పడం ఉపమానం. ఒక మనిషి తను చేసిన పనిని తలంచుకొని గర్వపడితే, వెంటనే అంతరంగంలో బుద్ధి యొక్క హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికను డమరుక నాదంతో పోలుస్తున్నారు. అహంకారం పెరిగేకొద్దీ హెచ్చరిక పెరిగి వెంటాడుతూనే ఉంటుంది.
అయితే ఈ గర్వపడడం బహిర్గతంగా ఇతరులతో అననక్కరలేదు - అంటే నే చేసాననే గొప్పదనం ఇతరులతో చెప్పుకునే దాకా కూడా కాదు. మనస్సులో తలచినంత మాత్రముచేత తప్పుచేసిన వాడి వవుతావని అంటున్నారంటే, ఎంత జాగ్రత్తగా మనోవ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలో అర్థం చేసుకోవాలి. ఎవరి మనస్సులో వారే తమ దోషాలను నివారించుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశ్యం.
ముఖ్యంగా వీరశైవులు ఆచరించే లింగారాధన, జంగమారాధన విషయంలో గర్వించడం, డాంబికాన్ని ప్రదర్శిండం క్షమించరాని అపరాధమవుతుంది.
వీరశైవులు ఏ కార్యం/కర్మ చేసినా శివార్పణా భావంతో చేస్తారు. సద్గురువు నుండి శివదీక్ష స్వీకరించిన శిష్యునికి సంచితకర్మలన్నీ(accumulation of deeds from previous births) గురుకటాక్షంతో హరించుకు పోతాయని విశ్వాసం. అంతే గాక కర్మకాండలకు దూరంగా ఉంటారు - యజ్ఞయాగాదులు వంటివి చేయరు. ఉదాహరణకు ధనం కలగాలని కొందరు పూజలు చేయిస్తుంటారు. కొందరు స్వర్గానికి వెళ్తామని యజ్ఞం చేయిస్తారు. ఇలాంటివి ఫలితాలు కలగడానికి చేసే కర్మకాండలు వీరశైవులకు నిషేదించబడ్డాయి. ఏమీ ఆశించక చేసే గురు, లింగ, జంగమ పూజ మాత్రమే వీరశైవధర్మఆచారం.
అయితే జీవితం కొనసాగించాలంటే కర్మ చేయడం తప్పదు కదా? మరి ఈ జన్మలో చేసే కర్మల ఫలం మాటేమిటి? ఒక మంచి వ్యక్తిగా జీవించాలంటే మంచి పనులు మాత్రమే చేయాలి - అంటే ఇష్టలింగ పూజ, గురు పూజ, జంగమ పూజ,దాసోహం, దానం మొదలైనవి. వీటి కర్మఫలం (results of tasks) మనని అంటకుండా ఉండాలంటే, ఎలా?
ప్రతి కర్మని శివార్పణ భావంతో, అంటే శివుడే చేయిస్తున్నడన్న భావంతో చేస్తే, అంతేగాక వాటి ఫలితాలు శివునికే అర్పిస్తే, ఆ కర్మలు చేసినా వాటి ఫలితాలు అంటవు. ఇది ఒక మానసిక ప్రక్రియ (mental tuning). నీ మనస్సులో నీవు ఇది నా గొప్పదనం అని అహంకరించకుండా, శివుని కృపవల్ల చేయగల్గుతున్నాననే అనకువను అలవరచుకోవడం. ముందు నోటితో అన్నా, క్రమంగా ఈ శివార్పణ భావం మనస్సుకి అలవాటైపోతుంది. అలా చేసిన కర్మ నిష్కామ కర్మ అవుతుంది. అలా జీవించిన వాడు జీవన్ముక్తికి , అంటే చావుకు కాదు - శివసాయుజ్యానికి, అర్హతను సంపాదించుకుంటాడు.
అయితే సంసారంలో ఉన్నవానికి ఈప్సితములు (నిత్య అవసరములు, కోరికలు) ఉంటాయి కదా? అని అడిగితే అవి శివుడే తప్పకుండా అనుగ్రహిస్తాడని బసవన్న చెబుతున్నారు .
పని చేయడం మానమని కాదు. పని చేస్తు శివుని కృపగా తలంచి చేయాలి, అని.
పని చేయటం వరకు నీ బాధ్యత - ఇవ్వటం ఆయన బాధ్యత.
ఈ వచనం మనం ప్రతిక్షణం ఆలోచించవలసిన ఆంతరంగిక హెచ్చరికగా అలవాటు చేసుకోవాలి.

No comments:
Post a Comment