కన్నడ వచనం:
ಜಗದಗಲ ಮುಗಿಲಗಲ ಮಿಗೆಯಗಲ ನಿಮ್ಮಗಲ!
ಪಾತಾಳದಿಂದತ್ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಚರಣ!
ಬ್ರಹ್ಮಾಂಡದಿಂದತ್ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಮಕುಟ!
ಅಗಮ್ಯ ಅಪ್ರಮಾಣ ಅಗೋಚರ ಅಪ್ರತಿಮ ಲಿಂಗವೇ,
ಕೂಡಲಸಂಗಮದೇವಯ್ಯ,
ఈ వచనానికి తెలుగు అనువాదము చదివేముందు బసవన్న వ్రాసిన కన్నడ వచనాన్ని కొన్ని సార్లు చదవండి. బసవన్నకు శివలింగాన్ని చూడగానే కలిగే రోమాంచము (పులకింత) మనకి ఆ పదాలలోనే కనబడుతుంది. తెలుగులో అంత చక్కగా వ్రాయలేక పోయినందుకు బాధ!
ధ్యానం:
లింగమంటే ఒక రాయా? మట్టిముద్డా?
లోకంలో ఏంతో మంది ఉన్నారు. శివపూజ చేయాలంటే ఏ గుడికో వెళ్ళాలి. పూజారులు పూజిస్తే ఆ లింగాన్ని దూరం నుండి చూడాలి. ఎప్పుడైనా ఏ గుళ్ళో నైనా దయతలిస్తే ముట్టుకోవచ్చేమో! దానికీ పెద్ద వరుసలో గంటల తరబడి నిలబడాలి. అలా జరుగుతుంది శివలింగ దర్శనం. ఇంట్లో పెట్టుకోవాలంటే వారికి భయాలు, సందేహాలు.
అయితే సంసారంచక్రం నుండి తరించడానికి ఒకేఒక్క మార్గమైన శివలింగాన్ని చూడడము దర్శించడము చేయాలంటే వారు నానా ప్రయాసా పడాలి.
మరి వీరశైవులు ఎంత పుణ్యాత్ములో? పుట్టగానే, లోకంపోకడ తెలియక ముందే ఇష్టలింగధారణ చేసేస్తారు! ఎక్కడో గుడిలోగానీ దర్శించలేని లింగాన్ని మెడలో వేసేస్తారు. శివలింగానికి రోజు తనకు తాను ఎక్కడున్నా ఏంతో ప్రీతితో పూజించుకునే అవకాశం. ఎంత అదృష్టం ఉంటే ఇంతటి అవకాశం లభిస్తుందో ఆలోచించండి.
ఈ అవకాశం ఉచితంగా(free గా) వచ్చిందని చులకనా? అంతటి అవకాశాన్ని జారవిడుచుకోవడం నోటివద్ద పెట్టిన అమృతాన్ని త్రోసివేయడం కాదా?
క్షమించండి.. ఎవరినో చిన్నబుచ్చడానికి, లేక ఇతరులకు బోధించడానికి కాదు పై ప్రశ్నలు. అంతటి సాహసం చేయలేను. ఇవి ఈనాటి వీరశైవులు ఎవరికి వారు తమ మనస్సులో చేసుకోవలసిన ఆత్మపరిశీలనకు ఉపకరణాలు మాత్రమే. రేపటి వీరశైవులకు తమ అదృష్టాన్ని గుర్తు చేయడానికి కూడా పనికి వస్తాయేమో!!
బసవన్న వంటి గురువు, సాక్షాత్ చరలింగస్వరూపుడైన జంగమయ్య అందించిన ఈ ఇష్టలింగాన్ని అరచేతిలోకి తీసుకొని, మన ప్రాణకారకుడైన ప్రాణలింగాన్నిఇష్టలింగంలోకే ఆహ్వానించి, పై వచనంలో వివరించిన మహలింగాన్ని ఊహించి తెచ్చుకొన్న భావలింగాన్నిమనస్సులో ప్రతిష్టించుకొని, ఈ ఇష్ట, ప్రాణ, భావ లింగాలను అనుసంధానం చేసి ఒక్కసారి పులకరింతతో పూజిస్తే అంతటి మహేశ్వరుడైనా మనకోసం స్వతహాగా చులకనై మనని చేరడా?
ಪಾತಾಳದಿಂದತ್ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಚರಣ!
ಬ್ರಹ್ಮಾಂಡದಿಂದತ್ತತ್ತ ನಿಮ್ಮ ಶ್ರೀಮಕುಟ!
ಅಗಮ್ಯ ಅಪ್ರಮಾಣ ಅಗೋಚರ ಅಪ್ರತಿಮ ಲಿಂಗವೇ,
ಕೂಡಲಸಂಗಮದೇವಯ್ಯ,
ಎನ್ನ ಕರಸ್ಥಲಕ್ಕೆ ಬಂದು ಚುಳುಕಾದಿರಯ್ಯ.
తెలుగు లిపిలో
జగదగల ముగిలగల మిగెయగల నిమ్మగల
పాతాళదిందత్తత్త నిమ్మ శ్రీచరణ!
బ్రహ్మాండదిందత్తత్త నిమ్మ శ్రీమకుట
అగమ్య అప్రమాణ అగోచర అప్రతిమ లింగవే!
కూడలసంగమదేవయ్య, ఎన్న కరస్థలకె బందు చులకాదిరయ్య!
తెలుగు వచనం:
జగతిమించు దివినిమించు విశ్వముమించు నీవిస్తృతి
పాతాళము దాటునవి నీ శ్రీచరణములు, బ్రహ్మాండమును దాటునది నీ శ్రీమకుటము!
అగమ్య అప్రమాణ అగోచర అప్రతిమ లింగమువే!
కూడలసంగమ దేవయ్య, నా కరస్థలమునకు వచ్చి చులకనైతివయ్య!
వచనకర్త ఆంతర్యం:
పరమేశ్వరా! బ్రహ్మాండమంతా నిండుకునేవాడివే.. నీ చరణములు పాతాళముకన్నా క్రిందకు ఉంటాయి. నీ శిరస్సు ఆకాశము దాటినది. అసలు హద్దులు పెట్టలేని రూపమై, ఎవరికీ చిక్కనిదై యుండు మహాలింగమై యుండి కూడా ఈ అరచేతిలో చిక్కి చిన్నవాడివైనవా?
విశ్లేషణ:
ఈ వచనానికి తెలుగు అనువాదము చదివేముందు బసవన్న వ్రాసిన కన్నడ వచనాన్ని కొన్ని సార్లు చదవండి. బసవన్నకు శివలింగాన్ని చూడగానే కలిగే రోమాంచము (పులకింత) మనకి ఆ పదాలలోనే కనబడుతుంది. తెలుగులో అంత చక్కగా వ్రాయలేక పోయినందుకు బాధ!
ధ్యానం:
ఆపాతాళనభస్థలాన్త భువన బ్రహ్మాండమావిస్పుర
జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పుర్నేందు వాన్తామృతైః
అస్తోకప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయేత్ ధృవపదం విప్రోభిశమ్చేత్శివమ్
అని రుద్రసూక్తము పొగిడే మహాలింగము గురించి అచ్చు అలాంటి వర్ణనతోనే బసవన్న ఇక్కడ ఇష్టలింగ స్వరూపాన్ని వివరించారు. రుద్రాధ్యాయనికి ముందు ఇది ఎలాగైతే ధ్యానమంత్రమో, చాలా మంది వీరశైవులు ఈ వచనాన్ని తమ శివపూజకు ముందు ధ్యానించడానికి ఉపయోగించుకుంటారు. అస్తోకప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయేత్ ధృవపదం విప్రోభిశమ్చేత్శివమ్
లింగమంటే ఒక రాయా? మట్టిముద్డా?
మనకు తెలిసిన, తెలియని విశ్వములు ఎంత అనంతమో (infinite), దాన్నంతటిని మించి ఉండేది శివ లింగము. గణితశాస్త్రంలో ఉపయోగించే అనంతములు( positive and negative infinities) +∞ మరియు -∞ లను దాటి ఉండే తత్వము శివుడు. ఊర్ధ్వలోకాలు, అథోలోకాలు (parallel universes in different planes) తనలో ఇముడుకొని సృష్టికర్తననుకునే వానికే అర్థంకాని మహారూపమే శివలింగము. ఆ లింగాన్ని ఈ వచనం ఎంత చక్కగా వర్ణిస్తోందో చూద్దాం.
అగమ్యము (endless) - ఎవరికీ అంతు చిక్కనిది. బ్రహ్మవిష్ణువులకు కూడా అంతుచిక్కని మహాలింగము. విష్ణువు పాతాళము వరకూ వెళ్ళగా ఆ లింగము యొక్క మూలము తెలియక తిరిగి వచ్చాడు. బ్రహ్మ విశ్వాలన్నింటిపైకెగిరెగిరి గతిలేక వెనుదిరిగాడు. ఈ లింగానికి దేశకాల హద్దులు (time and space constraints) లేవు.
అప్రమాణము (uncomparable) - అంటే ఉదాహరణ చూపలేనిది. అసలు ఎవరైనా చూస్తేగదా ఇలా ఉంటుంది అని చెప్పడానికి!
అగోచరము (unexplainable) - ఇంద్రియములకు, అంటే చూపు, వాసన, స్పర్శ, వినికిడి, రుచులకు అర్థంకానిది. వేదం కూడా పూర్తిగా తెలుసు అని వివరించలేనిది. ఇది అని చెప్పలేనిది. మాములు జీవులు కనిపెట్టలేనిది, అర్థంకానిది.
అప్రతిమం (formless) - రూపము లేనిది, విగ్రహము కానిది. మనకు దర్శనమివ్వడానికి నాగాభరణుడు, నీలకంఠుడు, జటాజూటధారి, పార్వతీ సహితుడు అయినాడు కాని, శివునికి అసలు రూపమే లేదు!! అతడు రూపరహితుడు, గుణరహితుడు, నిరాకారుడు. లింగము ఆ రూపరాహిత్యాన్ని తెలుపుతోంది.
అందుకే శుద్ధస్పటిక (crystal) లింగమని వేదం వర్ణించింది. అంటే అంతటా వ్యాపించి ఉంటూ తన పారదర్శకత (transparency) వల్ల ఎవ్వరికి కనిపించనిది.
అంతెందుకు మన దేహంలోనే, హృదయాన్తర్వర్తి అయి ఉంటూ అనాహటంగా మన గుండె గంట (heart beat) మోగిస్తూ, మన ప్రమేయం లేకుండానే అవయవాలకన్నింటికీ శక్తిని ప్రసరిస్తూ, శరీరాన్ని నడుపుతున్నవాడై, ప్రాణధారమై ఉన్న లింగమూర్తిని ఎలా తెలుసుకోగలం?
అంతటి గొప్పలింగము ఇష్టలింగమై మనకు అందిందని ప్రతీసారి ఆయనను చేతిపీఠంపై ఉంచినప్పుడు ఆలోచిస్తే, ఆ శివతత్వాన్ని భావిస్తే, ఆ మహలింగాన్నిఊహించి ధ్యానిస్తే కలిగే తన్మయతవల్ల శివపూజకు సార్థకత కల్గుతుంది. ఆ తన్మయత్వం కలిగించడానికే ఈ వచనం.
గురుణాదత్తమై, దీక్ష సంస్కారముచేత హృదయస్థల నివసితమై నిత్యం ముప్పూటలా అతిప్రీతితో పూజలందుకోవలసిన ఇష్టలింగమునకు ఈనాడు ఏ బీరువాలోనో, డబ్బాలోనో, గోడకు వేలాడబడే దుస్థితి వస్తుందని గ్రహించారేమో బసవన్న!! ఆనాడే అన్నారు .. నా చేతిలోకి వచ్చి చులకనైతివయ్యా అని. అగమ్యము (endless) - ఎవరికీ అంతు చిక్కనిది. బ్రహ్మవిష్ణువులకు కూడా అంతుచిక్కని మహాలింగము. విష్ణువు పాతాళము వరకూ వెళ్ళగా ఆ లింగము యొక్క మూలము తెలియక తిరిగి వచ్చాడు. బ్రహ్మ విశ్వాలన్నింటిపైకెగిరెగిరి గతిలేక వెనుదిరిగాడు. ఈ లింగానికి దేశకాల హద్దులు (time and space constraints) లేవు.
అప్రమాణము (uncomparable) - అంటే ఉదాహరణ చూపలేనిది. అసలు ఎవరైనా చూస్తేగదా ఇలా ఉంటుంది అని చెప్పడానికి!
అగోచరము (unexplainable) - ఇంద్రియములకు, అంటే చూపు, వాసన, స్పర్శ, వినికిడి, రుచులకు అర్థంకానిది. వేదం కూడా పూర్తిగా తెలుసు అని వివరించలేనిది. ఇది అని చెప్పలేనిది. మాములు జీవులు కనిపెట్టలేనిది, అర్థంకానిది.
అప్రతిమం (formless) - రూపము లేనిది, విగ్రహము కానిది. మనకు దర్శనమివ్వడానికి నాగాభరణుడు, నీలకంఠుడు, జటాజూటధారి, పార్వతీ సహితుడు అయినాడు కాని, శివునికి అసలు రూపమే లేదు!! అతడు రూపరహితుడు, గుణరహితుడు, నిరాకారుడు. లింగము ఆ రూపరాహిత్యాన్ని తెలుపుతోంది.
అందుకే శుద్ధస్పటిక (crystal) లింగమని వేదం వర్ణించింది. అంటే అంతటా వ్యాపించి ఉంటూ తన పారదర్శకత (transparency) వల్ల ఎవ్వరికి కనిపించనిది.
అంతెందుకు మన దేహంలోనే, హృదయాన్తర్వర్తి అయి ఉంటూ అనాహటంగా మన గుండె గంట (heart beat) మోగిస్తూ, మన ప్రమేయం లేకుండానే అవయవాలకన్నింటికీ శక్తిని ప్రసరిస్తూ, శరీరాన్ని నడుపుతున్నవాడై, ప్రాణధారమై ఉన్న లింగమూర్తిని ఎలా తెలుసుకోగలం?
అంతటి గొప్పలింగము ఇష్టలింగమై మనకు అందిందని ప్రతీసారి ఆయనను చేతిపీఠంపై ఉంచినప్పుడు ఆలోచిస్తే, ఆ శివతత్వాన్ని భావిస్తే, ఆ మహలింగాన్నిఊహించి ధ్యానిస్తే కలిగే తన్మయతవల్ల శివపూజకు సార్థకత కల్గుతుంది. ఆ తన్మయత్వం కలిగించడానికే ఈ వచనం.
లోకంలో ఏంతో మంది ఉన్నారు. శివపూజ చేయాలంటే ఏ గుడికో వెళ్ళాలి. పూజారులు పూజిస్తే ఆ లింగాన్ని దూరం నుండి చూడాలి. ఎప్పుడైనా ఏ గుళ్ళో నైనా దయతలిస్తే ముట్టుకోవచ్చేమో! దానికీ పెద్ద వరుసలో గంటల తరబడి నిలబడాలి. అలా జరుగుతుంది శివలింగ దర్శనం. ఇంట్లో పెట్టుకోవాలంటే వారికి భయాలు, సందేహాలు.
అయితే సంసారంచక్రం నుండి తరించడానికి ఒకేఒక్క మార్గమైన శివలింగాన్ని చూడడము దర్శించడము చేయాలంటే వారు నానా ప్రయాసా పడాలి.
మరి వీరశైవులు ఎంత పుణ్యాత్ములో? పుట్టగానే, లోకంపోకడ తెలియక ముందే ఇష్టలింగధారణ చేసేస్తారు! ఎక్కడో గుడిలోగానీ దర్శించలేని లింగాన్ని మెడలో వేసేస్తారు. శివలింగానికి రోజు తనకు తాను ఎక్కడున్నా ఏంతో ప్రీతితో పూజించుకునే అవకాశం. ఎంత అదృష్టం ఉంటే ఇంతటి అవకాశం లభిస్తుందో ఆలోచించండి.
ఈ అవకాశం ఉచితంగా(free గా) వచ్చిందని చులకనా? అంతటి అవకాశాన్ని జారవిడుచుకోవడం నోటివద్ద పెట్టిన అమృతాన్ని త్రోసివేయడం కాదా?
క్షమించండి.. ఎవరినో చిన్నబుచ్చడానికి, లేక ఇతరులకు బోధించడానికి కాదు పై ప్రశ్నలు. అంతటి సాహసం చేయలేను. ఇవి ఈనాటి వీరశైవులు ఎవరికి వారు తమ మనస్సులో చేసుకోవలసిన ఆత్మపరిశీలనకు ఉపకరణాలు మాత్రమే. రేపటి వీరశైవులకు తమ అదృష్టాన్ని గుర్తు చేయడానికి కూడా పనికి వస్తాయేమో!!
బసవన్న వంటి గురువు, సాక్షాత్ చరలింగస్వరూపుడైన జంగమయ్య అందించిన ఈ ఇష్టలింగాన్ని అరచేతిలోకి తీసుకొని, మన ప్రాణకారకుడైన ప్రాణలింగాన్నిఇష్టలింగంలోకే ఆహ్వానించి, పై వచనంలో వివరించిన మహలింగాన్ని ఊహించి తెచ్చుకొన్న భావలింగాన్నిమనస్సులో ప్రతిష్టించుకొని, ఈ ఇష్ట, ప్రాణ, భావ లింగాలను అనుసంధానం చేసి ఒక్కసారి పులకరింతతో పూజిస్తే అంతటి మహేశ్వరుడైనా మనకోసం స్వతహాగా చులకనై మనని చేరడా?
Eee vachana vishleshan chadivina ea veerashivulakana, Linga dharana, pooja prashtyam,entha viluvainado,mariu mana janma entha sukruthaminadi telusundthi.
ReplyDelete