కన్నడ వచనం
ಸಂಸಾರವೆಂಬುದು ಒಂದು ಗಾಳಿಯ ಸೊಡರು!
ಸಿರಿಯೆಂಬುದು ಒಂದು ಸಂತೆಯ ಮಂದಿ ಕಂಡಯ್ಯ!
ಇದ ನೆಚ್ಚಿ ಕೆಡಬೇಡ;
ಸಿರಿಯೆಂಬುದ ಮರೆದು ಪೂಜಿಸು
ನಮ್ಮ ಕೂಡಲಸಂಗಮದೇವನ!
తెలుగు లిపిలో
సంసారవెంబుదు ఒందు గాళియ సూడరు
సిరియెంబుదు ఒందు సంతెయ మంది కండయ్య
ఇద నెచ్చి కెడబేడ
సిరియెంబుద మరెదు పూజిసు
నమ్మ కూడలసంగమ దేవన
తెలుగు వచనం
సంసారమనునది ఒక గాలిలో దీపము
సిరియనునది సంతలోమంది వంటిది కదయ్యా
ఇది నచ్చి చెడకు
సిరియనునది మరచి పూజించు
మన కూడలసంగమ దేవుని
వచనకర్త ఆంతర్యం
పరమేశ్వరున్ని పుజించే సమయంలో విషయ వాంఛలు, ధనం గురించిన ఆలోచనలు వదిలి, శుద్ధమైన మనస్సుతో పూజించాలి.
విశ్లేషణ
ఎన్నో విధాలుగా పూజించాను, కాని దానివల్ల ఎలాంటి ప్రతిఫలము దొరకడం లేదు అనే సంశయము కలుగుతుంటుంది కొన్ని సార్లు. ఇది ఒకరకం. ఎంతో వైభవంగా పూజ చేసాను అని గర్వంగా చెప్పుకుంటాము. పైగా చేసే పూజకన్నా ప్రచారం ఎక్కువ. ఇది ఇంకొకరకం.
ఎంత వైభవంగా చేస్తే అంత మందిని పిలవాలి. పైగా అందరూ వస్తారని అలంకారాల మీద ధ్యాస - ఆ రోజు ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అని ముందు నుండే ప్రణాలికలు, తయారీ. పూజించడానికి కూర్చున్నప్పుడు మాత్రం మనస్సు అక్కడ నిలువదు. పూజకోసం పీటల మీద కూర్చొని, వచ్చినవారిని సైగలతో పలకరిస్తాము. అంటే "చిత్తం శివుని మీద, భక్తి చెప్పులమీద!!", అవునా, కాదా? చేయించేవారు ఎదో చెబుతారు, మనం చేసేస్తాము. అక్షంతలు వాసన చూసి వెనక్కి వేయడం నుండి మొదలుకొని, నీళ్ళు వదిలే వరకు ఎదో చెబుతున్నారు మనం చేస్తున్నాము. కాని ఏమి జరుగుతుందో తెలియదు. తెలుసుకొనే ప్రయత్నమూ ఉండదు. మరమనిషి (ROBOT) తనను నియంత్రించే యజమాని (computer programmer) సూచనలను అనుసరించినట్లు. కాని మరమనుషులము కాముగదా.. మనసు ఒకటి ఉంది కదా!! అది మాత్రం స్వేచ్చగా సంసారంలో విహరిస్తూ ఉంటుంది. అంటే చేసేది ఎంత పెద్ద వ్రతమైనా, పూజైనా అది చెప్పుకోవడానికే గాని, దానివల్ల ఒరిగేది కొంచమే అవుతుంది.
మనస్సు చెదరడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నిత్యసంసారములోని సుఖదుఃఖముల ఆలోచనలు (విషయ వాంఛలు). రెండవది సంపద యొక్క ప్రభావం. ఈ రెండూ మనస్సుని నిలువనీయక ఎప్పుడు ఖాళీ దొరికినా వచ్చి చేరతాయి.
శివపూజకు ఉపక్రమించే ముందు వీటివల్ల కలగబోయే అంతరాయాలను ముందే పసిగట్టగల్గితే ఉపయోగం ఉంటుంది. ఈ వచనంలో బసవన్న ఈ పసగట్టడం నేర్చుకోమంటున్నారు. సంసారము గాలిలో దీపంలా ఎప్పుడు రెపరెపలాడేది, శాశ్వతము కాదు. కాబట్టి విషయవాంఛలను గురించి ఆలోచనలను ప్రక్కన బెట్టమని మొదటి ప్రతిపాదన.
శివపూజ నిరాడంబరంగా ఉంటుంది. నీళ్ళు, భస్మము, ఏ పువ్వో,పత్రో తప్పితే ఉపయోగించే వస్తువులు కూడా ఏమీ ఉండవు. నీవు తినే పదార్థాన్నే నైవేద్యంగా పెట్టడం తప్ప గొప్పగా చేయాల్సిన వంటలూ లేవు. ఇక్కడ ధనంతో, డంబచారంతో చేసేదేమీ ఉండదు. ఇది రెండవ ప్రతిపాదన.
వీరశైవులకు అన్ని వ్రతాలు నిషేధించబడి కేవలం శివపూజ మాత్రమే నిత్య దీక్షగా వ్రతముగా ప్రతిపాదించబడింది. ఇక ఇటువంటి నిరాడంబరమైన పూజ చేసేవానికి ధనమును, ధనార్జనను గురుంచిన ఆలోచన ఉండకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలా చేయడం అలవాటైతే మనిషికి వ్యక్తిత్వ వికాసము కూడా కలుగుతుంది. - తనకు సిరి లేదనే బాధ కాని, ఉన్నదనే అహంకారము గాని లేక అందరితో సమానంగా వ్యవహరించడం నేర్చుకుంటాము. మనస్సు నిలుస్తుంది కాబట్టి ఆ శివలింగములో లయించి ముక్తి మార్గంలో ముందుకు సాగడమూ సులువవుతుంది.
కాబట్టి ఇలాంటి పూజనే అలవరచు కుందాం..
శరణు శరణార్థి!!
Edi Nitya Satyamu kani yevaru paatincharu.
ReplyDeleteMana Valaki veeti gurinchi inka kluptanga teliyacheyali.
ee vachanamu nanu chala alochimpa chesindi
Dhanyavadamulu....