Showing posts with label శివభక్తి. Show all posts
Showing posts with label శివభక్తి. Show all posts

Sunday, November 20, 2016

52. Vyasa Boyitiya Maga - Basavanna

కన్నడ వచనం 

ವ್ಯಾಸ ಬೋಯಿತಿಯ ಮಗ.
ಮಾರ್ಕಂಡೇಯ ಮಾತಂಗಿಯ ಮಗ.
ಮಂಡೋದರಿ ಕಪ್ಪೆಯ ಮಗಳು.
ಕುಲವನರಸದಿರಿ ಭೋ!
ಕುಲದಿಂದ ಮುನ್ನೇನಾದಿರಿ ಭೋ!
ಸಾಕ್ಷಾತ್ ಅಗಸ್ತ್ಯ ಕಬ್ಬಿಲ.
ದೂರ್ವಾಸ ಮಚ್ಚಿಗ.
ಕಶ್ಯಪ ಕಮ್ಮಾರ.
ಕೌಂಡಿನ್ಯನೆಂಬ ಋಷಿ
ಮೂರುಲೋಕವರಿಯೆ ನಾವಿದ ಕಾಣಿ ಭೋ!
ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ವಚನವಿಂತೆಂದುದು-
"ಶ್ವಪಚೋಪಿಯಾದರೇನು ಶೀವಭಕ್ತನೇ ಕುಲಜಂ" ಭೋ!

తెలుగు లిపిలో 

వ్యాస బోయితియ మగ 
మార్కండేయ మాతంగియ మగ
మండోదరి కప్పెయ మగళు 
కులవనరసదిరి భో!
కులదింద మున్నేనాదిరి భో! 
సాక్షత్ అగస్త్య కబ్బిల 
దూర్వస మచ్చిగ 
కశ్యప కమ్మార 
కౌండిన్యనెంబ ఋషి
మూరులోకవరియె  నావిద కాణి భో 
నమ్మ కూడలసంగన వచన వింతెందుదు 

"శ్వపచోపి యాదరేను, శివభక్తనే  కులజం" భో!! 

తెలుగు వచనం 

వ్యాసుడు బోయిత కొడుకు
మార్కండేయుడు మాతంగి తనయుడు 
మండోదరి కప్ప కూతురు 
కులమునెంచకోయి, కులమువల్ల ముందేమైన దోయి?
సాక్షాత్తు అగస్త్యుడు కబ్బిల, దూర్వాసుడు ముచ్చెగ,
కశ్యపుడు కమ్మరి,  కౌండిన్యుడను ఋషి 
మూడులోకములరయ మంగలి కనవోయి!
మా కూడలసంగని వచనమిట్లనును 

"శ్వపచుడైననేమి, శివభక్తుడే కులజుడు"!!

అర్థం 

బ్రాహ్మణ్యము పుట్టుకతో వచ్చే కులము కాదు. శివభక్తితో కలుగుతాయి. ఉత్తమ కులములో పుట్టాననుకొని గర్వించకు. పూర్వము గొప్పవారంతా రకరకాల కులాలలో పుట్టి తమ శివభక్తితో ఉత్తములుగా కీర్తించ బడ్డారు. 

విశ్లేషణ 

భారతావనిలో కులవివక్ష ముందు నుండి ఉండేది కాదు. వర్ణ వ్యవస్థ కేవలం వృత్తిరీత్యా  సమాజంలో ఒకరికి ఒకరు సహకరించుకోడానికి ఏర్పరచుకొన్న విధానమేగాని మనుషులను విడదీయడానికి కాదు. 

ఏ దేశంలోని సమాజములు చుసినాసరే  వృత్తి అనేది వంశపారంపర్యంగా వస్తుండడం చూడవచ్చు. ఉదాహరణకు ఆంగ్లేయులలో చూస్తే "Smith", "Mason", "Carpenter", "Cobbler" వంటి రకరకాల ఇంటిపేర్లు  చూస్తూ ఉంటాం. అంటే వీరంతా తమ వృత్తిని వంశపారంపర్యంగా సాగిస్తుండేవారని చెప్పకనే తెలిసిపోతుంది. ఇలాంటి సాంప్రదాయం అన్ని జాతులలో ఉండేవి. వేలసంవత్సరాల చరిత్ర కలిగిన భారతఖండంలో కూడా ఇది మామూలే. 
అయితే తొలుత ఏ వృత్తి వారైనా తమ కులవృత్తిని పాటించినా, తమ ఆధ్యాత్మిక మార్గంలో సాధించిన జ్ఞానం వల్ల ఋషులుగా మారారు. వారి కాలంలో ఆధ్యాత్మిక సాధనకు వృత్తి అడ్డం కాలేదు. పై వచనంలో చెప్పిన ఉదాహరణలు చూస్తే తెలిసిపోతుంది. 

  • వేదాలను విభజించి, అష్టాదశ పురాణాలు వ్రాసిన వ్యాసుడు పడవ నడిపే మత్స్యగంధి కొడుకు. అతను బోయతకు పుట్టాడు; అయినా  బ్రహ్మత్వము పొందకుండా పోలేదు. 
  • మృతువును జయించిన మార్కండేయుడు మాతంగి (మాదిగకన్య) పుత్రుడు 
  • మహా పతివ్రత మండోదరి కప్పు కూతురు.. ఇక ఆమె కులమేది?
  • సముద్రాన్ని మ్రింగిన వాడు, వింధ్య పర్వతమును వంచినవాడు, దక్షిణ దేశానికి ఆప్తుడు, ద్రావిడ భాషకు ఆద్యుడు, కావేరి నది పుట్టుకకు కారణమైనవాడు, రేణుకాచార్యుని శిష్యత్వమును పొందగలిగిన మొదటి వీరశైవశిష్యుడు అగస్త్యుడు కబ్బలి,అంటే కల్లు తీసే వృత్తికి  చెందిన వాడు. 
  • ఎన్నో యుగాలలో మహామహులను పరీక్షించి, వారికి కీర్తి కల్పించినవాడు, ఇంద్రుని సైతం శపించి మదమనిచిన దుర్వాసుడు చర్మకార వృత్తికి చెందిన వాడు 
  • దేవ, దానవ, దైత్య, నాగ, గరుడ జాతుల కారకుడగు కశ్యపుడు కమ్మరి వృత్తి సాగించిన వాడు
  • కౌండిన్య ఋషి మంగలి వృత్తి వాడు 
ఎంతో మంది ఋషులు తమ శివభక్తి చేత బ్రహ్మత్వము పొంది బ్రాహ్మణులుగా మారినారు. అంతేగాని వాళ్ళు పుట్టుకతో కాదు. అయితే ఇది కాలక్రమేణా కులంగా మారిపోయింది. కొందరు స్వార్థపరుల ప్రయోజనార్థం దీన్ని ఉచ్ఛనీచ కులాలుగా విడదీసి కొన్ని వృత్తులవారిని తక్కువ కులంవారిగా ఎంచి వారిని ఆధ్యాత్మికతకు దూరంగా పెట్టే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా బసవన్న కాలంలో ఇటువంటి వ్యవహారం చాలా ఎక్కువగా ఉండేది. బసవన్న ఇటువంటి దురాచారాన్ని తీవ్రంగా ఖండించారు. 

"శివభక్తులైనవారెవరైనా సరే  ఉత్తమ కులవంతులే. అటువంటివారు శ్వపచులుగా అంటే అంటరానివారుగా పుట్టినా సరే, పూజ్యులే అవుతార"ని వీరశైవ ధర్మము, శరణ సాహిత్యము నిర్ణయించింది.  

కులవివక్ష ముందునుండి లేదని, వర్ణము కేవలం సామాజిక అనుకూలతకే ఏర్పరచబడిందని కొద్దిగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. పైన చెప్పినట్లు అన్ని దేశాలలో ఇటువంటి విభజన చేయబడింది.  అయితే కొన్ని మతాల వారు దీన్ని సాకుగా చేసుకొని నేడు చాలా మంది పామరులకు లేని పోనివి చెప్పి మభ్యపెడుతున్నారు. హిందువుల గ్రంథాలలో కులవివక్ష చెప్పబడిందని, తక్కువ కులాలవారిని అణిచి ఉంచడం నమ్ముతారని దుష్ప్రచారం చేస్తూ , చాలా మందిని తమ మతానికి మారుస్తున్నారు. కొందరి స్వార్థం కోసం వృత్తిని కులంగా మార్చడం నిజమే - కానీ దాన్ని వ్యతిరేకించి సరైన మార్గం చూపిన బసవన్న వంటి సంస్కర్తలకు కొదవలేని దేశం మనది. ఎవరైనా శివభక్తితో ఉన్నత స్థితిని, పూజ్యత్వాన్ని పొందుతారని నిరూపించడానికి  పైన చెప్పబడిన ఉదాహరణలే చాలు. మనధర్మాన్ని స్థాపించిన ఋషులే నేడు తక్కువ కులాలుగా భావించే వాటినుండి వచ్చినవారు. ఇది తెలియక పరాయి మతముల ప్రలోభాలకు లొంగి, వారి దుష్ప్రచారములు నమ్మి, స్వధర్మాన్ని వదలి, భక్తి మార్గాన్ని మరచి, ముక్తి గురించి తెలియని ఎండ మావుల కోసం ప్రాకులాడే పామరులెందరో!!

ఈ ప్రమాదం భావితరాల వారికి ఇంకా ఎక్కువ. మనధర్మము యొక్క గొప్పదనము, సామాజిక సమానత్వము, శివభక్తి యొక్క గొప్పదనము పిల్లలకు చిన్నప్పటి నుండి నూరిపోయకపోతే వారు బయట వినే దుష్ప్రచారాన్ని నమ్మే అవకాశం చాలా ఎక్కువ.  కాబట్టి, వారికి ధర్మము గురించిన సరైన అవగాహన కలిగించాలని ప్రతీ తల్లీదండ్రికి విజ్ఞప్తులతో .. శరణు శరణార్థి !!



Meaning

Caste is not based on birth. Greatness comes through devotion to Shiva. Don't boast that you are born in a higher caste. If you look at the past, people born in different professions have attained enlightenment and thereby were respected as brahmins due to their Shiva Bhakti.


Analysis:

Caste discrimination was not initially part of the Indian tradition. Caste system is a byproduct of a classification based on profession.  While profession was inherited in a family, the skill passed naturally for generations and thereby improved the quality of products produced due to continuous learning. So classification based on profession was imminent and a natural progression for any culture including the Indian subcontinent.

As an example, if you look at the last names in English speaking countries you find "Smith", "Mason", "Carpenter", "Cobbler" etc that clear indicate that these families were involved in corresponding professions for generations. India was no different. In fact, with thousands of years of history (much more than most of the countries we know of), it was a natural for the culture to adopt such classification.

Initially, while people followed their familial profession, the profession did not become an interruption to their "spiritual progression". Anyone could attain spiritual enlightenment and be considered a Rishi. A few such examples are listed in the vachana above:

  • Sage Vyasa who classified vedas and authored 18 puranas was the son of Matsyagandhi, a ferry woman. His birth did not come in the way of his enlightenment
  • Sage Maarkandeya, the one who won over death, was the son of maatangi, a pariah
  • Mandodari, who is respected as a chaste and virtuous wife of Ravana was the daughter of a frog.. so what can her caste be?
  • Sage Agastya, the one who could consume oceans, the one who stopped Vindhya from growing, the one who is regarded as a pioneer of Dravidian language, the one who was chosen by Jagadguru Renuka as his prime disciple was an arrack brewer
  • Sage Durvasa, the one who put several great personalities on trial, well known for his anger, the one who cursed even Indra for his arrogance, was a cobbler
  • Sage Kashyapa, the pioneer of devas, danavas, daityas, nagas, garuda and others was a blacksmith
  • Sage Kaundinya was a barber
And the list goes on. Rishis have attained enlightenment and divinity by the virtue of their Shiva bhakti, and not by their birth. 

As time progressed the profession transformed into a caste. Politics and power hunger have played a big role in this transition where certain groups started treating others as ones with lower status. That was the beginning of oppression. Now the higher castes also used their control to prevent certain groups of people from progressing spiritually. This behavior reached its peak by 12th century. Basavanna has severely condemned such oppression. 

Veerashaiva Philosophy and Vachana Saahitya have concluded that -




"Anyone with devotion to Shiva is of a higher rank and caste from birth has no relation to such a status. Even an untouchable who has Shiva bhakti is revered in the society".

 A simple analysis will prove that discrimination by caste was not part of the culture to begin with while social division by profession was part of every culture. However, some of the religions of late have been using this as a reason for religious conversions. They project traditional Indian culture as caste-based and oppressive and use this as a reason to propose religious switch. While it is true that there was oppression in the Indian society, like any other, India has produced several free thinkers and social reformers like Basavanna who opposed such oppression. Basavanna used devotion towards god and spiritual progression as a means of achieving social equality unlike current day's conversions that spread hatred and divide society. Based on the examples above, if the basic fabric of Indian culture and different schools of thoughts that emerged in this culture, were pioneered by sages born in the so called lower classes, how would they even promote discrimination based on caste? Without understanding this simple reasoning, the so called thinkers in today's society are encouraging conversions. They don't understand that one should be seeking inner transformation through spiritual progression and switching a religion wouldn't help in anyway.

The future generations would be subject to this misinformation a lot more than we currently are. So parents would have to make conscious efforts to teach their kids the values of our traditions, the respect and social equality that the tradition brings, undeterred devotion towards Shiva and most importantly make them proud of their heritage.

Sharanu Sharanaarthi!! 






Saturday, October 29, 2016

51. Dushakavananobba Deshava Kottade - Basavanna

కన్నడ వచనం

ದೂಷಕನವನೊಬ್ಬ ದೇಶವ ಕೊಟ್ಟಡೆ,
ಆಸೆಮಾಡಿ ಅವನ ಹೊರೆಯಲಿರಬೇಡ.
ಮಾದಾರ ಶಿವಭಕ್ತನಾದಡೆ ಆತನ ಹೊರೆಯಲು
ಭೃತ್ಯನಾಗಿಪ್ಪುದು ಕರ ಲೇಸಯ್ಯಾ,
ತೊತ್ತಾಗಿಪ್ಪುದು ಕರ ಲೇಸಯ್ಯಾ.
ಕಾಡ ಸೊಪ್ಪು ತಂದು ಓಡಿನಲ್ಲಿ ಹುರಿದಿಟ್ಟು,
ಕೂಡಿಕೊಂಡಿಪ್ಪುದು ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಶರಣರ

తెలుగు లిపిలో 

దూషకనవనొబ్బ దేశవ కొట్టడె
ఆసెమాడి అవన హొరెయలిరబేడ
మాదార శివభక్త నాదడె ఆతన హొరెయలు
భృత్యనాగిప్పుదు కర లేసయ్యా
తొత్తాగిప్పుదు కర లేసయ్యా
కాడ సొప్పు తందు ఓడినల్లి హురిదిట్టు
కూడి కొండిప్పుదు నమ్మ  కూడలసంగన శరణర

తెలుగు వచనం 

దూషకుడొక్క దేశమిచ్చినసరే,
ఆశజేసి అతని బరువునబడకు
మాదిగ శివభక్తుడైన ఆతని చెంత
భృత్యుడైయుండుట కడు లెస్సయ్యా ,
తొత్తైయుండుట కడు లెస్సయ్యా
అడవియాకులుదెచ్చి బాణలిన వేయించి
కూడి కొనియొప్పేరు మా కూడలసంగని శరణులు

అర్థం

దూషకులు, అవినీతి పరులను ఎట్టి పరీస్థితులలోను చేరదీయకు. వాళ్ళు దేశమిచ్చి మభ్య పెట్టినా వారి భారమున పడరాదు; ఆశ పడడము మంచిది కాదు. దోషికి కులంతో సంబంధము లేదు.
మాదిగైనా సరే శివభక్తుడైతే, దోషరహితముగా ఉంటే , అతనికి సేవకుడై ఉండుట ఉత్తమము. శివశరణులు అడవి ఆకులు తిని బ్రతుకుతారు గాని దూషకులను సహించరు.

విశ్లేషణ

ఎటువంటి వారిని చేరదీయవచ్చు, ఎటువంటివారిని దూరంగా ఉంచాలనేది స్పష్టంగా తెలిపే వచనమిది.

దూషకులుకు సహకరించరాదనేది మొదటి ప్రతిపాదన. దూషకులు తమ స్వార్థం కోసం ఇతరులను కించపరచి, వారికి మనశ్శాంతిని పోగొట్టడంలో ఆనందం పొందుతారు. వీళ్ళు తమకు తొత్తులుగా ఉండటానికి ఇతరులను మభ్యపెట్టడానికి వారికి రకరకాల ఆశలు కల్పిస్తారు. సామదానదండోపాయాలలో ఏవైనా ప్రయోగించవచ్చు. ఇలాంటివాటికి జడిసి గాని, ఆశపడి గాని వారికి సహకరించకూడదని ఖండితంగా చెప్పబడింది. చిన్న విషయంలో రాజీపడినా అటువంటివారి చెప్పుచేతలలో ఇరుక్కొని వారి అడుగులకు మడుగులొత్తవలసి వస్తుంది. కర్ణుని వంటి గొప్ప యోధుడు కూడా ఇటువంటి కారణంవల్లనే సుయోధనునికి సహకరించవలసి వచ్చింది.

మన సమాజంలో వర్ణవ్యవస్థ ప్రభావంవల్ల దోషం ఎవరిదైనా, దోషాన్ని విస్మరించి తమ కులంవాళ్ళకి, ప్రాంతంవాళ్ళకి కళ్ళుమూసుకొని తొత్తు పలకడం చాలా సాధారణమైన విషయం. ఈ బలహీనతను అదునుగా చూసుకొని తమ స్వార్థంకోసం తప్పులుచేసి  తమ కులాన్ని, బంధువర్గాన్ని  వాడుకుంటూ తప్పించుకునే వారిని చాలామందిని చూస్తుంటాము. ఈ విషయాన్నీ తీవ్రంగా నిరసించారు బసవన్న.

శివభక్తి అంటే కేవలం విభూతి, రుద్రాక్షలు ధరించడం కాదు. తప్పులు చేస్తూ శివుణ్ణి పూజించడమూ కాదు. వీరశైవులు సదాచారాన్ని పాటించాలి. ధర్మాన్ని వదిలినవాడు శివభక్తుడు కాజాలడు, శివభక్తుడని పిలవబడడు.

ఇక శివభక్తికి కులంతో ఎటువంటి సంబంధంలేదు. మాదిగగా పుట్టినా సరే శివభక్తుడైతే, ధర్మ మార్గంలో నడిస్తే, అతనికి ఊడిగం చేయమన్నారు బసవన్న.  వీరశైవుల పాటించే ఆచారాలలో భృత్యాచారం ఒకటి. ఇక్కడ శరణులు ఇతర శరణులకు శరణార్థులై సుశ్రూష చేస్తారు. ఒక శివభక్తునికి కైంకర్యం చేసేటప్పుడు అతని కులం అడ్డురాకూడదు. ఇలా భక్తిమార్గాన్ని, మంచితనాన్ని కూడగట్టి నిష్పక్షపాత సమాజాన్ని నిర్మించడం శివశరణుల లక్ష్యం. శరణులు తమకు తినడానికి అన్నం కరువైనా సరే ధర్మాన్ని మాత్రం వదిలి పెట్టారు. అడవి ఆకులు తినైనా బ్రతుకుతారు గాని శివభక్తుల పట్ల కులరహితసమానత్వాన్ని, దుర్మార్గంపట్ల వ్యతిరేకతను వదులుకోరు.

ఈనాటి సామాజిక వ్యవహార శైలిని చక్కబరచుకోవడానికి  అతి ముఖ్యమైన వచనమిది. ఈ విషయాన్ని ఖచ్చిత్తంగా పాటిస్తే, తమకు సహకారం దొరకదని తెలిస్తే, దుర్మార్గులు ఎటువంటి గుడిలోకైనా, మఠంలోకైనా అడుగుపెట్టడానికి భయపడతారు. మంచి వాళ్లకు మాత్రమే ప్రోత్సాహం లభిస్తే, దైవభక్తి- ఆస్తికత్వం పెరుగుతాయి. ధర్మం నిలబడుతుంది.

శరణు శరణార్థి!!!


Meaning:

Don't ever take side of a libeler or an impious individual even if he offers a kingdom in return; such a mistake in greed is inappropriate. Offense has no relation to ones caste. 
If a cobbler is a Shiva's devotee, and stays pious, you would rather aid him as a servant; rather be his toady. Sharanas prefer to live on fried forest leaves than to be in an impious association.

Analysis:

This vachana advises on using discretion while selecting the types of people you associate with.

First advise is to keep away from impious and liberers even if they offer favors in return. Liberers believe in taking advantage of their caste or community for their own benefit. They cause harm and incite unrest to the society. They try to escape from their misdeeds by hiding behind their kin and/or caste. They don't shy away from showing the strength of their community to silence others. They may offer favors to gain support. However, know that simplest compromise may lead to disaster, as you would be under emotional blackmail from that point on and would be obligated to support them even if they are wrong. An example of such an instance is Karna from Mahabharata who in spite of his valour, subjugated himself to Suyodhana; while he knew he was on the wrong side, he was helpless. 

Caste system had a major influence in our society. Sometimes the judgement of right vs wrong is significantly influenced by the caste of the involved. It is not uncommon to see people using caste to their advantage and to escape from their misdeeds. This is vehemently opposed by Basavanna.

Devotion to Shiva doesn't just mean wearing Vibhuti and Rudrakshas. Neither does it mean that we  just pray everyday and continue on the same path that causes harm to the society. Veerashaivam expects you to follow "Sadaachara", the righteous path to be called a Shiva Bhakta. One who veers away from this path is not called a Shiva Bhakta. So, righteousness and devotion are inseparable for  one to be a real Shiva Bhakta.

In addition, such devotion has no relation to caste. Basavanna advised that we should subjugate ourselves as a slave to a shiva-bhakta even if he was born as a cobbler or a pariah. Veerashaivas follow "Bhrityaachara" as one of the five acharas. This process requires a sharana to serve other sharanas as slaves. While following bhrityachaara, a sharana's former caste should never be accounted for. Sharanas have consolidated philosophical thoughts giving due consideration to social equality and impartiality.  As said in this vachana, they have taken a rigid stance of dying out of hunger or accepting a life feeding on jungle-leaves than to get out of their belief in anti-caste and anti-nepotism. 

This vachana acquires a lot of prominence in the current state of affairs. If the intent of this vachana is followed to principle, the temples and mathas wouldn't allow corrupt and impious personnel on their premises. This in turn increases belief in god and establishment of dharma.

Sharanu Sharanaarthi!!













Saturday, October 1, 2016

45. Uttamakuladalli Huttida 46. Settiyandene Siriyaalana 47. Appanu Namma Maadara Chennayya 48. Hiriyayya Shvapachayya - Basavanna

కన్నడ వచనం 

ಉತ್ತಮಕುಲದಲ್ಲಿ ಹುಟ್ಟಿದೆನೆಂಬ
ಕಷ್ಟತನದ ಹೊರೆಯ ಹೊರಿಸದಿರಯ್ಯಾ,
ಕಕ್ಕಯ್ಯನೊಕ್ಕುದನಿಕ್ಕ ನೋಡಯ್ಯಾ,
ದಾಸಯ್ಯಾ ಶಿವದಾನವನೆರೆಯ ನೋಡಯ್ಯಾ,
ಮನ್ನಣೆಯ ಚೆನ್ನಯ್ಯನೆನ್ನುವ ಮನ್ನಿಸ.
ಉನ್ನತ ಮಹಿಮ,
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ಶಿವಧೋ ಶಿವಧೋ !

తెలుగు లిపిలో 

ఉత్తమకులదల్లి హుట్టిదెనెంబ 
కష్టతనద హొరెయ  హొరిసదిరయ్య ,
కక్కయ్యనొక్కుదనిక్క నోడయ్యా,
దాసయ్య శివదానవ నెరెయ నోడయ్యా,
మన్నణెయ చెన్నయ్యనన్నువ మన్నిస 
ఉన్నత మహిమా,
కూడలసంగమ దేవ, శివధో  శివధో  

తెలుగు వచనం 

ఉత్తమకులమందు పుట్టితినన్న
కష్టతనపు బరువు భరియింపకుమయ్య
కక్కయ్యమెతుకులేయడు  చూడయ్యా
దాసయ్య మజ్జిగపోయడు చూడయ్యా
మన్ననలొందు చెన్నయ్య నను మన్నించడు
ఉన్నత మహిమాకర  కూడల సంగమ దేవ,   శివశివా, శివశివా !!

అర్థం
ఉత్తమ కులమందు పుట్టినానన్న మాట నా నోట రానివ్వకు.  ఇతరుల నోట కూడా నా గురించి అటువంటి పదములు రానివ్వకు. అది వినబడిన శివశరణుల ప్రసాదము లభించదు. వారికి దూరమైపోతాను.

-----------------


కన్నడ వచనం 

ಸೆಟ್ಟಿಯೆಂದೆನೆ ಸಿರಿಯಾಳನ
ಮಡಿವಾಳನೆಂಬೆನೆ ಮಾಚಯ್ಯನ
ಡೋಹರನೆಂಬೆನೆ ಕಕ್ಕಯ್ಯನ
ಮಾದಾರನೆಂಬೆನೆ ಚೆನ್ನಯ್ಯನ
ಆನು ಹಾರುವನೆಂದಡೆ ಕೂಡಲಸಂಗಯ್ಯ ನಗುವನಯ್ಯಾ.

తెలుగు లిపిలో
సెట్టియెందెనె సిరియాళన?
మడివాళ నెంబనె మాచయ్యన?
డోహారనెంబనె కక్కయ్యన?   
మాదరనెంబనె చెన్నయ్యన?
ఆను హారువనెందెండె కూడల సంగయ్య నగువనయ్య!!

తెలుగు వచనం    
శెట్టియందునే సిరియాళుని?
చాకలియందునే మాచయ్యను?
డోహారుడందునే కక్కయ్యను?
మాదిగయందునే చెన్నయ్యను?
నేను  అగ్రజుడననుకొనిన  కూడల సంగయ్య నవ్వునయ్య!!

అర్థం
శివశరణులను వారి జన్మము వృత్తి ప్రకారము వేరు చేస్తే శివునికి నచ్చదు. నవ్వుతాడు.

-----------------------

కన్నడ వచనం 

ಅಪ್ಪನು ನಮ್ಮ ಮಾದಾರ ಚೆನ್ನಯ್ಯ,
ಬೊಪ್ಪನು ನಮ್ಮ ಡೋಹರ ಕಕ್ಕಯ್ಯ,
ಚಿಕ್ಕಯ್ಯನೆಮ್ಮಯ್ಯ ಕಾಣಯ್ಯ,
ಅಣ್ಣನು ನಮ್ಮ ಕಿನ್ನರ ಬೊಮ್ಮಯ್ಯ,
ಎನ್ನನೇತಕ್ಕರಿಯರಿ, ಕೂಡಲಸಂಗಯ್ಯಾ

తెలుగు లిపిలో 
అప్పను నమ్మ మాదరచెన్నయ్య
బొప్పను నమ్మ డోహార కక్కయ్య,
చిక్కయ్యనెమ్మయ్య కాణయ్య,
అణ్ణను నమ్మ కిన్నర బొమ్మయ్య,
ఎన్ననేతక్కరియరి కూడలసంగయ్య?

తెలుగు వచనం 
మాదర చెన్నయ్య నా అప్ప
డోహార కక్కయ్య నా పెద్దప్ప
చూడయ్యా, చిక్కయ్య నా చిన్నయ్య
కిన్నర బొమ్మయ్య నా అన్నయ్య
మరినన్నెందుకుపిలువవు కూడలసంగయ్యా?

అర్థం
నీ శరణులనందరినీ వారి వారి జాతి బీదములను ఎంచక, శివధర్మానువర్తనుడనై వారినందరినీ నా ప్రియ బంధువులుగా భావిస్తున్నాను. నీ శరణులకు ఆప్తుడనైన నన్నెందుకు పట్టించుకోవట్లేదు? అంటే శివునికి చేరువవ్వాలంటే బీద-గొప్ప, వర్ణభేదములు వంటిని విడిచి శివశరణులనందరినీ తన ఆప్తులవలే భావించాలి, పూజించాలి.
----------------------

కన్నడ వచనం
ಹಿರಿಯಯ್ಯ ಶ್ವಪಚಯ್ಯ,
ಕಿರಿಯಯ್ಯ ಡೋಹರ ಕಕ್ಕಯ್ಯ,
ಅಯ್ಯಗಳಯ್ಯ ನಮ್ಮ ಮಾದಾರ ಚೆನ್ನಯ್ಯ.
ಕೂಡಲಸಂಗಮದೇವಾ,
ನಿಮ್ಮ ಶರಣರು ಎನ್ನ ಸಲಹುವರಾಗಿ

తెలుగు లిపిలో

హిరియయ్య శ్వపచయ్య,
కిరియయ్య  డోహార కక్కయ్య,
అయ్యగళయ్య మాదర చెన్నయ్య
కూడలసంగమదేవా నిమ్మ శరణరు ఎన్న సలహువరాగి

తెలుగు వచనం

పెద్దయ్యయ్యి శ్వపచయ్య,
చిన్నయ్యయ్యి  డోహార కక్కయ్య,
అయ్యలకయ్యయ్యి  మాదర చెన్నయ్య
కూడలసంగమదేవా మీ శరణులు నన్ను అక్కునజేర్చిరి

అర్థం
శివశరణుల దయ వలన నేను వారి దెగ్గర వాడనైతిని. వారే నా ఆప్తులు, బంధువులు. వారే నన్ను చేరదీసినవారు.

---------

వ్యాఖ్యానం

వీరశైవ సాంప్రదాయంలో శివభక్తులందరూ సమానులేనని కుల బేధం ఉండదని దేవసహిత భక్త మనెగె బందరె అనే వచనంలో చర్చించుకున్నాము. అయితే బసవన్న మాటల వాడే కాదు చేతల వాడు అని నిరూపించే వచనాలు పైవి.  గౌరవం కులాన్ని బట్టి, పుట్టుకను బట్టి కాదని,  శరణుడు ఏ కులములో పుట్టినా, శరణుడైనందున వారి కులమును ఎంచరాదని బసవన్న నమ్మాడు.

పుట్టింది బ్రాహ్మణుడిగా, పెరిగింది అగ్రహారంలో.  ఇతరులను తక్కువ వాళ్ళుగా చూడడం తప్పన్న తలంపు కూడా కలుగని కాలమది. వ్యవస్థలో మిగిలిన కులాలవారు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అని, వ్యతిరేకించాలని జ్ఞానం ఉండే  కాలం కాదు. విధించబడిన సాంప్రదాయాలను నమ్మి అలాగే జీవనం గడిపే సమాజం ఆనాటిది.

బసవన్న తనను గురువుగా భావించి ఇతరులు తనను పూజించండని ఉద్దేశించే పలుకులు ఎక్కడా కనబడవు. పైగా  ఎనగింత కిరియరిల్ల, శివభక్తరిగింత హిరియరిల్ల!  అంటూ తాను ఇతర శరణులకన్నా తక్కువవాడనని శివునిపై ప్రమాణం చేసాడు. అలానే శివశరణుల పాదోదకాన్ని, ప్రసాదాన్ని స్వీకరించేవాడు. కక్కయ్య ఎంగిలి మెతుకులు ప్రసాదంగా తీసుకునేవాడు. తన ఉత్తమకులంలో పుట్టానని నన్ను వేరు చేయకండని బసవన్న వాపోయారు.బసవన్న గొప్పవాడని  తాను తలచినా,  ఇతరులు ఆలోచించినా వెంటనే తనకు ఆప్తులైన శరణులు దూరమవుతారు. కక్కయ్య ప్రసాదం పెట్టడానికి జంకుతాడు, దాసయ్య మజ్జిగ పొయ్యడానికి ఆలోచిస్తాడు. చెన్నయ్య తనతో కలసి కూర్చోవడానికి  భయపడతాడు. అయితే దీన్ని చమత్కారంగా వాళ్లు తనకన్నా గొప్పవారని చెప్పడానికి, తనను కోప్పడతారని బసవన్న చెప్పుకున్నాడు.

వృత్తి అనేది కేవలం సమాజంలో బ్రతకడానికి చేయవలసిన ధర్మంగా శరణులు బ్రతుకుతారు. ఎంతటి శివభక్తులైనా "ధర్మార్జితేన ద్రవ్యేణ తృప్తిశ్చ కురుతే సదా గురులింగ జంగమానాం" అని నమ్మే వారు. తాము ధర్మ ప్రకారము కష్టపడి సంపాదించిన  వస్తువులు మాత్రమే గురువు, జంగమ, లింగ అర్చనలకు ఉపయోగిస్తారు.  తమకు తగిన వృత్తిలో పనిచేస్తారు; పనిని మానరు. ఎలాంటి వృత్తిలో ఉన్నా శివశరణులైనందున దాని ప్రకారం వారిని వర్ణ వ్యవస్థతో విభజించడం కుదరదు. అందుకే శివశరణుడైన సిరియాళుడు వ్యాపారం చేసేవాడు కాబట్టి అతన్ని శెట్టి అనవచ్చునా? శరణుల బట్టలను ఉతికే మడివాళ మాచయ్యను చాకలి అనవచ్చునా?  చర్మకారుడైన కక్కయ్యను డోహారుడనవచ్చునా? శరణులకు చెప్పులు కుట్టే మాదయ్యను మాదిగయనవచ్చునా? అని ప్రశ్నించాడు బసవన్న.

సిద్ధాంత శిఖామణి, 11వ పరిచ్ఛేదము, 54 వ శ్లోకము

బ్రాహ్మణః క్షత్రియోవాzపి వైశ్యో వా శూద్ర ఏవ వా|
అంత్యజో వా శివే భక్తః శివవన్మాన్య ఏవ సః||

బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, అంటరానివాడని దూరముంచే  పంచముడైనా ఎవరైనా సరే శివభక్తికలిగి ఉన్నట్లయితే శివుని వలే గౌరవనీయుడవుతాడు. అంటే శివభక్తులకు వర్ణముతో సంబంధము లేదు - భక్తుడు శివునితో సమానముగా మాన్యుడు.

55వ శ్లోకం
శివభక్తి సమావేశే క్వ జాతి పరికల్పనా|
ఇంధనేష్వగ్నిదగ్ధేషు కో వా భేదః ప్రకీర్త్యతే ||

శివభక్తి కలిగిన జీవునికి పూర్వపు జాతి భేదముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అంత్యజ మొదలైన) పరికల్పన కుదరదు. అగ్నిలో దగ్ధమైన ఇంధనంలో (కట్టెలు, పుల్లలు, మొక్కలు వంటి వాటి భస్మంలో)  భేదములు గుర్తించడం ఎలా కుదరదో అలాగే శివభక్తుల పూర్వజాతిని ఎంచడం కుదరదు.


బసవన్న వీరశైవ ధర్మాన్ని నమ్మి నిరూపించడానికి అవతరించాడు. అందుకే శరణులను తన ఆప్తులుగా భావించాడు. మాదర చెన్నయ్యను తన తండ్రిగా చెప్పుకున్నాడు. డోహార కక్కయ్యను పెదతండ్రిగా పిలిచాడు. చిక్కయ్యను పినతండ్రియన్నాడు. కంసాలి కిన్నర బ్రహ్మయ్యను అన్నయ్య అన్నాడు. శివశరణుల సాంగత్యములో ఉండే వారంటే శివునికి ఇష్టం. కాబట్టి వీరి సంబంధినైన నన్ను చేరదీయమని శివుని వేడుకున్నాడు.

 ఇంకో వచనంలో శ్వపచయ్య  పెద్దయ్యగా,  డోహార కక్కయ్య చిన్నయ్యగా,  మాదర చెన్నయ్య తాతగా తనను ప్రేమతో చేరదీసారని చెప్పుకున్నాడు; వారి ప్రేమ వల్ల తాను తరిస్తానని భావించాడు. వారందరినీ తను చేరదీసానన్న మాట ఎప్పుడూ అనలేదు. శరణుల ఆశీర్వాదంతో తాను తరిస్తున్నానని నమ్మాడు. ఇది భక్తునికి, భక్తిలేని వానికి ఉండే వ్యత్యాసం.

ఈనాడు మానవుల సమానత్వం గురించి పోరాడేవారు ఉన్నారు.  తేడా ఏంటంటే ఆనాడు బసవన్న సమానత్వం కోసం భక్తిని పంచాడు; ఈనాడు సమానత్వం పేరుతో ద్వేషాన్ని పంచుతున్నారు.  ఫోటోలు దిగడానికి చీపురుకట్టలు పట్టే వారు, రోడ్లు ఊడ్చే వారు చాలామంది తగులుతారు. తమ పుట్టు పూర్వోత్తరాలను వదిలి తాము నమ్మిన సిద్ధాంతం ప్రకారము ఇతరులను తమ బంధువులుగా తలచే వాళ్ళు ఎంతమంది?

సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వం , వర్ణ వ్యవస్థ నాటుకుపోయిన కాలంలోసిద్ధాంత శిఖామణిలో నేర్పిన సాంప్రదాయాన్ని నిలపడానికి జాతి భేదములు లేకుండా  తనను తాను తక్కువ చేసి చూపుకునే బసవన్న వంటి సంస్కర్తను ఏ దేశంలోనైనా  ఊహించగలమా?

శరణు శరణార్థి !!!















Sunday, September 11, 2016

43. Shakunavemdembe Apashakunavemdembe - Basavanna

కన్నడ వచనం 

 ಶಕುನವೆಂದೆಂಬೆ ಅಪಶಕುನವೆಂದೆಂಬೆ,
 ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಂದೇಕೆ ಬಂದೆ ?
 ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಿಂದೇಕೆ ಹೋದೆ ?
 ನೀ ಹೋಹಾಗಳಕ್ಕೆ!
 ನೀ ಬಾಹಾಗಳಕ್ಕೆ!
 ಅಕ್ಕೆ ಬಾರದ ಮುನ್ನ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗಮದೇವನ.


తెలుగు లిపిలో 


శకునవెందెంబె, అపశకునవెందెంబె
నిమ్మవరు అళలికందేకె బందె?
నిమ్మవరు అళలికందేకె హోదె?
నీ హోహాగళక్కె! నీ బాహాగళక్కె!
అక్కె బారాద మున్న పూజిసు కూడల సంగమ దేవన


తెలుగు వచనం

శకునమనేవు , అపశకునమనేవు
మీవారినేడిపించుటకు ఆనాడెందు కొచ్చావు?
మీవారినేడిపించుటకు ఈనాడెందుకు పోయావు?
నీవచ్చుట యేడఁచుటకే, నీవు పోవుట యేడఁచుటకే
ఆ దుఃఖము రాకమునుపే పూజించు కూడల సంగమ దేవుని!

అర్థం 
శకునములు, అపశకునములు ఎంచుతూ జీవితమంతా గడుపుతూ ఉంటే, జనన మరణ చక్రములో పడి ఇరుక్కు పోతావు. అటువంటి సంసార దుఃఖమును నివారించు కోవాలంటే కూడల సంగమ దేవుని శరణు వేడుకొని పూజించు. 

విశ్లేషణ 

మన సమాజంలో శకునముల ప్రభావం తరతరాలుగా నాటుకు పోయి ఉంది.  పిల్లి ఎదురైతే మంచిది కాదని, ముత్తైదువ ఎదురైతే మంచిదని, విధవ ఎదురైతే మంచిది కాదని, తుమ్మితే పని జరగదని, దంపతులు ఎదురొస్తే మంచిదని, కాకి కూస్తే చుట్టాలొస్తారని, మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదని, ఆడవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిది కాదని రకరకాల నమ్మకాలతో పెద్ద శకున శాస్త్రమే పాటిస్తూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము. వీటిపై నమ్మకంతో పనులు మానుకునే వారినీ చూస్తాము. అయితే వీరశైవులు వీటిని ఎలా తీసుకోవాలో తెలిపే వచనం ఇది.

వీరశైవ వచన సాహిత్యము శకునములను వీరశైవులు పాటించ కూడదని చెబుతున్నాయి. శివున్ని నమ్మకంతో కొలిచే వారు శకునములు వదిలి పెట్టాలి; వాటి ప్రభావము నిత్య శివపూజ నిష్ఠులై, లింగంగ సంయోగముతో నుండే వారిపై ఉండదు. శుభ శకునములన్న ఉత్సాహము, అపశకునముల ఆవేదన రెండూ కూడా శివభక్తిపై అపనమ్మకమును సూచనలే. 

మనిషి పుట్టేటప్పుడు తన కుటుంబీకులకి, ముఖ్యంగా తల్లికి తీవ్రమైన ఆవేదన కలిగిస్తాడు.  తానేడుస్తూ నే వస్తాడు. ఏడిపిస్తూ నే (బాధ కలిగిస్తూనే) పుడతాడు. ఈ పుట్టేటప్పుడు శకునాలు, అపశకునాలు చూసుకొని పుట్టడు. 
అదే విధంగా వెళ్లిపోయేటప్పుడు కూడా తనవారందరి ఏడుపుకు, బాధకు కారణమవుతాడు. అక్కడ కూడా శకునములు, అపశకునములు చూసుకొని పోయే అవకాశము ఉండదు. 

ఈ మధ్యలో ఉన్నకాలము శకునములు, అపశకునములు ఎంచుతూ, కాలం వృధా చేసుకోవడం చూస్తూ ఉంటాము. నిత్యం ఇప్పుడెందుకు వచ్చావని, అప్పుడెందుకు పోయవని విపరీతయమైన ఆలోచనలు - ఇతరులను వేధించడం.

కర్మ మార్గములో ఉంటూ, కర్మ ఫలాలను అనుభవిస్తూ  ఉండేవారికి  శకున శాస్త్రం పాటించడం పరిపాటి. ఇటువంటి వారు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ  ఉంటారు.  ఇటువంటి వారు  "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం" అన్నట్లు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ  ఉంటారు. 

భక్తి-జ్ఞానమార్గ నిష్ఠాపరులు, ముముక్షువులైన వీరశైవులు ఎరుకతో శివున్ని పూజిస్తారు. శివునిపై అపారమైన నమ్మకంతో ఉంటూ ఏ విధంగానైతే  పాపపుణ్యముల ఫలములను త్యజిస్తారో, అదే విధంగా శుభాశుభ శకునములను కూడా పట్టించుకోరు, పాటించరు. ఇలా తిరస్కరిస్తారు కాబట్టి ఈ జన్మలోనే జీవన్ముక్తులై, జరామరణ దుఃఖమునకు దూరమవుతారు. అటువంటి మార్గంలో ఉంటూ సంసారదుఃఖం దరిజేరక ముందే శివున్ని పూజించమని బసవన్న సలహా. 

శరణు శరణార్థి!!