కన్నడ వచనం
ಶಕುನವೆಂದೆಂಬೆ ಅಪಶಕುನವೆಂದೆಂಬೆ,
ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಂದೇಕೆ ಬಂದೆ ?
ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಿಂದೇಕೆ ಹೋದೆ ?
ನೀ ಹೋಹಾಗಳಕ್ಕೆ!
ನೀ ಬಾಹಾಗಳಕ್ಕೆ!
ಅಕ್ಕೆ ಬಾರದ ಮುನ್ನ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗಮದೇವನ.
తెలుగు లిపిలో
శకునవెందెంబె, అపశకునవెందెంబె
నిమ్మవరు అళలికందేకె బందె?
నిమ్మవరు అళలికందేకె హోదె?
నీ హోహాగళక్కె! నీ బాహాగళక్కె!
అక్కె బారాద మున్న పూజిసు కూడల సంగమ దేవన
తెలుగు వచనం
శకునమనేవు , అపశకునమనేవు
మీవారినేడిపించుటకు ఆనాడెందు కొచ్చావు?
మీవారినేడిపించుటకు ఈనాడెందుకు పోయావు?
నీవచ్చుట యేడఁచుటకే, నీవు పోవుట యేడఁచుటకే
ఆ దుఃఖము రాకమునుపే పూజించు కూడల సంగమ దేవుని!
ಶಕುನವೆಂದೆಂಬೆ ಅಪಶಕುನವೆಂದೆಂಬೆ,
ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಂದೇಕೆ ಬಂದೆ ?
ನಿಮ್ಮವರು ಅಳಲಿಕಿಂದೇಕೆ ಹೋದೆ ?
ನೀ ಹೋಹಾಗಳಕ್ಕೆ!
ನೀ ಬಾಹಾಗಳಕ್ಕೆ!
ಅಕ್ಕೆ ಬಾರದ ಮುನ್ನ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗಮದೇವನ.
తెలుగు లిపిలో
శకునవెందెంబె, అపశకునవెందెంబె
నిమ్మవరు అళలికందేకె బందె?
నిమ్మవరు అళలికందేకె హోదె?
నీ హోహాగళక్కె! నీ బాహాగళక్కె!
అక్కె బారాద మున్న పూజిసు కూడల సంగమ దేవన
తెలుగు వచనం
శకునమనేవు , అపశకునమనేవు
మీవారినేడిపించుటకు ఆనాడెందు కొచ్చావు?
మీవారినేడిపించుటకు ఈనాడెందుకు పోయావు?
నీవచ్చుట యేడఁచుటకే, నీవు పోవుట యేడఁచుటకే
ఆ దుఃఖము రాకమునుపే పూజించు కూడల సంగమ దేవుని!
అర్థం
శకునములు, అపశకునములు ఎంచుతూ జీవితమంతా గడుపుతూ ఉంటే, జనన మరణ చక్రములో పడి ఇరుక్కు పోతావు. అటువంటి సంసార దుఃఖమును నివారించు కోవాలంటే కూడల సంగమ దేవుని శరణు వేడుకొని పూజించు.
విశ్లేషణ
మన సమాజంలో శకునముల ప్రభావం తరతరాలుగా నాటుకు పోయి ఉంది. పిల్లి ఎదురైతే మంచిది కాదని, ముత్తైదువ ఎదురైతే మంచిదని, విధవ ఎదురైతే మంచిది కాదని, తుమ్మితే పని జరగదని, దంపతులు ఎదురొస్తే మంచిదని, కాకి కూస్తే చుట్టాలొస్తారని, మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిదని, ఆడవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిది కాదని రకరకాల నమ్మకాలతో పెద్ద శకున శాస్త్రమే పాటిస్తూ ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాము. వీటిపై నమ్మకంతో పనులు మానుకునే వారినీ చూస్తాము. అయితే వీరశైవులు వీటిని ఎలా తీసుకోవాలో తెలిపే వచనం ఇది.
వీరశైవ వచన సాహిత్యము శకునములను వీరశైవులు పాటించ కూడదని చెబుతున్నాయి. శివున్ని నమ్మకంతో కొలిచే వారు శకునములు వదిలి పెట్టాలి; వాటి ప్రభావము నిత్య శివపూజ నిష్ఠులై, లింగంగ సంయోగముతో నుండే వారిపై ఉండదు. శుభ శకునములన్న ఉత్సాహము, అపశకునముల ఆవేదన రెండూ కూడా శివభక్తిపై అపనమ్మకమును సూచనలే.
మనిషి పుట్టేటప్పుడు తన కుటుంబీకులకి, ముఖ్యంగా తల్లికి తీవ్రమైన ఆవేదన కలిగిస్తాడు. తానేడుస్తూ నే వస్తాడు. ఏడిపిస్తూ నే (బాధ కలిగిస్తూనే) పుడతాడు. ఈ పుట్టేటప్పుడు శకునాలు, అపశకునాలు చూసుకొని పుట్టడు.
అదే విధంగా వెళ్లిపోయేటప్పుడు కూడా తనవారందరి ఏడుపుకు, బాధకు కారణమవుతాడు. అక్కడ కూడా శకునములు, అపశకునములు చూసుకొని పోయే అవకాశము ఉండదు.
ఈ మధ్యలో ఉన్నకాలము శకునములు, అపశకునములు ఎంచుతూ, కాలం వృధా చేసుకోవడం చూస్తూ ఉంటాము. నిత్యం ఇప్పుడెందుకు వచ్చావని, అప్పుడెందుకు పోయవని విపరీతయమైన ఆలోచనలు - ఇతరులను వేధించడం.
కర్మ మార్గములో ఉంటూ, కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉండేవారికి శకున శాస్త్రం పాటించడం పరిపాటి. ఇటువంటి వారు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ ఉంటారు. ఇటువంటి వారు "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం" అన్నట్లు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ ఉంటారు.
కర్మ మార్గములో ఉంటూ, కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉండేవారికి శకున శాస్త్రం పాటించడం పరిపాటి. ఇటువంటి వారు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ ఉంటారు. ఇటువంటి వారు "పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం" అన్నట్లు సంసార చక్రంలో ఇరుక్కొని పుడుతూచస్తూ ఉంటారు.
భక్తి-జ్ఞానమార్గ నిష్ఠాపరులు, ముముక్షువులైన వీరశైవులు ఎరుకతో శివున్ని పూజిస్తారు. శివునిపై అపారమైన నమ్మకంతో ఉంటూ ఏ విధంగానైతే పాపపుణ్యముల ఫలములను త్యజిస్తారో, అదే విధంగా శుభాశుభ శకునములను కూడా పట్టించుకోరు, పాటించరు. ఇలా తిరస్కరిస్తారు కాబట్టి ఈ జన్మలోనే జీవన్ముక్తులై, జరామరణ దుఃఖమునకు దూరమవుతారు. అటువంటి మార్గంలో ఉంటూ సంసారదుఃఖం దరిజేరక ముందే శివున్ని పూజించమని బసవన్న సలహా.
శరణు శరణార్థి!!
No comments:
Post a Comment